Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ షాక్.. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినా తప్పని భారీ జరిమానా

Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ షాక్.. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినా తప్పని భారీ జరిమానా


Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ షాక్.. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినా తప్పని భారీ జరిమానా

Arshdeep Singh : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి భారత్ సంబరాల్లో మునిగిపోయిన వేళ, టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‎కు ఐసీసీ(ICC) షాకిచ్చింది. మైదానంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతనికి భారీ జరిమానా విధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ప్రవర్తన ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‎ను అతిక్రమించినట్లు తేలింది.

అసలేం జరిగింది?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ క్రీజులో ఉండగా, అర్ష్‌దీప్ బంతిని ఫీల్డ్ చేసి నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే ఆ త్రో అనవసరంగా మిచెల్ శరీరానికి బలంగా తగిలింది. ఇది ప్రమాదకరంగా ఉండటంతో పాటు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ భావించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.9 (అంతర్జాతీయ మ్యాచ్‌లలో వేరే ఆటగాడిపైకి బంతిని లేదా ఇతర వస్తువులను ప్రమాదకరంగా విసరడం) కింద ఇది లెవల్ 1 నేరంగా పరిగణించబడింది.

శిక్ష, స్పందన

ఈ తప్పిదానికి గాను అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ తన తప్పును అంగీకరించి డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పాడు. “నా త్రో కొంచెం రివర్స్ స్వింగ్ అయ్యి అతనికి తగిలింది, నేను కావాలని చేయలేదు” అని అర్ష్‌దీప్ వివరణ ఇచ్చాడు. మిచెల్ కూడా దీనిని స్పోర్టివ్‌గా తీసుకుని అర్ష్‌దీప్‌తో షేక్ హ్యాండ్ చేయడం విశేషం.

రికార్డుల హీరోకు చేదు అనుభవం

ఈ ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ భారత్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఒకవైపు వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో ఉన్న అర్ష్‌దీప్‌కు, ఐసీసీ శిక్ష విధించడం కొంచెం చేదు అనుభవమే అని చెప్పాలి. ఏది ఏమైనా, మైదానంలో దూకుడు ప్రదర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన క్రికెటర్లకు హెచ్చరికగా నిలిచింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *