సాధారణంగా కల నిజమైనప్పుడు ఆ సంతోషమే వేరు. ఇక ఐదు దశాబ్దాలుగా కంటున్న కల నెరవేరిన సమయంలో వారి ఆనందం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఒక ఊరికి ఎదురైంది. అసలు ఆ కల ఏంటి? ఆ ఊరు ఏది? అనేది ఇక్కడ వవివరంగా చదివి తెలుసుకుందాం..
ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఆ గ్రామానికి సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం వేరే ఊర్లు వెళ్లాల్సి వచ్చేది.
సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం ఎనిమిది కిలోమీ టర్లు నడవాల్సి వచ్చేది. 48 ఏళ్లుగా బస్సు ఎరుగని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెం గ్రామానికి పల్లెవెలుగు బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయినా.. ఊరు మీద ఉన్న మమకారంతో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నా ఒక పక్క దట్టమైన నల్లమల అడవులు, మరోపక్క కృష్ణమ్మ పరవళ్లు మధ్య నదితీర ప్రాంతానికి ఎగువన గుడిసెలు నిర్మించుకొని జీవనం సాగి స్తున్నారు
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్డు నిర్మించడంతో ఎట్టకేలకు ఆ గ్రామానికి అధికారులు బస్సును ఏర్పాటు చేశారు. దీంతో గ్రామానికి వచ్చిన బస్సుకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి ట గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.




