బాలీవుడ్ అందాల భామ కాజోల్ తన 30 ఏళ్ల సినీ కెరీర్లో పెట్టుకున్న ఒక నిబంధనను ఇటీవల బ్రేక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 'ద ట్రయల్' వెబ్ సిరీస్‌లో భాగంగా ఆమె లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీని పై తాజాగా కాజోల్ స్పందించింది.
కాజోల్ 1992లో 'బేఖుడి' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె ఒక రూల్‌ను పాటించారు. అదే “నో కిస్సింగ్ పాలసీ”. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే, ఓటీటీ డెబ్యూ సిరీస్ 'ద ట్రయల్' కోసం ఆమె ఈ రూల్‌ను పక్కన పెట్టారు.
లిప్ లాక్ సీన్‌పై కాజోల్ వివరణ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..నేను కేవలం స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఆ సీన్ అవసరమని అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక నటిగా పాత్రకు న్యాయం చేయడమే తన ప్రాధాన్యత అని, అనవసరమైన గ్లామర్ కోసం తాను ఆ పని చేయలేదని స్పష్టం చేశారు. అలాగే షూటింగ్ సమయంలో చిత్ర బృందం తనను చాలా గౌరవంగా చూసుకున్నారని, ఆ సీన్ చిత్రీకరణలో ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఆమె తెలిపారు.
కాజోల్ వంటి సీనియర్ నటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటిగా కొత్త ఛాలెంజ్ తీసుకున్నారని కొందరు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రూల్ బ్రేక్ చేయడం ఏంటని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ద ట్రయల్' అనేది అమెరికన్ సిరీస్ 'ద గుడ్ వైఫ్' కి రీమేక్. ఇందులో కాజోల్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు.




