హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? మీరు ఫైనాన్సియల్ సూసైడ్ చేసుకున్నట్టే.. తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? మీరు ఫైనాన్సియల్ సూసైడ్ చేసుకున్నట్టే.. తెలుసుకోవాల్సిన విషయాలు


ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాగానే అందరూ చేస్తున్న మొదటి పని హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం. కానీ, ఇది సంపదను సృష్టించడం కాదు, ఒక లైఫ్ లాంగ్ లయబిలిటీని(అప్పును) నెత్తిన వేసుకోవడమే అంటున్నారు బిజినెస్ నిపుణులు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కేవలం డబ్బు దాచుకోవడం కాదు, సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టడం.

అపార్ట్‌మెంట్ కొంటున్నారా? జాగ్రత్త!

హైదరాబాద్ లాంటి నగరాల్లో హై-రైజ్ అపార్ట్‌మెంట్లలో కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనేవారు ఒక విషయాన్ని గమనించాలి. మీరు కోటిన్నర పెట్టి కొన్న ఫ్లాట్‌లో మీకు వచ్చే అన్ డివైడెడ్ ల్యాండ్ షేర్(UDS) కేవలం 15-18 గజాలు మాత్రమే. అంటే రేపు ఆ బిల్డింగ్ పాతబడితే, మీ దగ్గర మిగిలేది ఆ కొద్దిపాటి భూమి మాత్రమే. అపార్ట్‌మెంట్ అనేది డిప్రిషియేటింగ్ అసెట్(విలువ తగ్గే ఆస్తి). దీనివల్ల మీరు ధనవంతులు అవ్వడం కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదమే ఎక్కువ అని హెచ్చరించారు.

అత్యాశే అసలు శత్రువు..

ట్రేడింగ్‌లో రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనే అత్యాశ వల్ల చాలామంది ఉన్నది పోగొట్టుకుంటున్నారు. రూపాయి వడ్డీ వచ్చే చోట పది రూపాయల వడ్డీ ఆశించడం అంటే మీ గొయ్యి మీరే తవ్వుకోవడమే. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు 40 ఏళ్ల తర్వాత తమ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో, భారీ హోమ్ లోన్లు పెట్టుకోవడం “ఫైనాన్షియల్ సూసైడ్” వంటిదేనని బిజినెస్ నిపుణులు ఘాటుగా విమర్శించారు.

సరైన ప్లానింగ్ అంటే ఏంటి?

పెళ్లి, పిల్లల చదువు, రిటైర్మెంట్.. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. పెళ్లికి ముందే ఇల్లు ఉండాలనే సొసైటల్ ప్రెషర్ వల్ల యువత జీవితాలను రిస్క్‌లో పడేస్తున్నారు. పెళ్లి చేసే ముందు అబ్బాయికి ఆస్తి ఉందా అని చూడటం కంటే, రేపు ఉద్యోగం పోతే కనీసం రెండు ఏళ్లు ఇబ్బంది లేకుండా బతకడానికి అవసరమైన ‘లిక్విడ్ క్యాష్’ ఉందా అనేది చూడటం ముఖ్యమని నిపుణులు సూచించారు.

Also Read: కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *