స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..

స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..


ఇటీవల చిన్న కారణాలకే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అప్పటివరకూ కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపిన వ్యక్తులు కళ్లముందే క్షణాల్లో విగతజీవులుగా మారిపోతున్నారు. ఆటలాడుతూ.. జిమ్‌ చేస్తూ.. భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. తాజాగా స్నేహితులతో కలిసి విందుభోజనానికి వెళ్లిన వ్యక్తి.. ఆ భోజనమే మృత్యుపాశంగా మారి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలోని బంగ్లాగడ్డ కాలనీకి చెందిన మద్దెల ఆంజనేయులు వృత్తిరీత్యా పెయింట్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం ఆంజనేయులు తన స్నేహితులతో కలిసి అడ్డాకుల మండలం కందూర్ స్టేజీ సమీపంలో ఉన్న ఒక దాబాలో భోజనానికి వెళ్లాడు. భోజనం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఒక మాంసం ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. ఆంజనేయులు ఊపిరి ఆడక ఇబ్బంది పడటం చూసిన స్నేహితులు భయాందోళనకు గురయ్యారు. అతడిని వెంటనే బైక్‌పై గ్రామానికి తీసుకువస్తుండగా, మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి ఆంజనేయులు ప్రాణాలు విడిచాడు. దాంతో భయపడిన స్నేహితులు, మూసాపేట కల్లు దుకాణం వద్ద ఆంజనేయులు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కల్లుదుకాణం వద్ద పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మూసాపేట ఎస్సై వేణు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా వెళ్లిన ఆంజనేయులు మృతి చెందడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ

Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోనే నెం.1

గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది

సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డు‌కు విద్యార్థి ఫోన్ కాల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *