సమ్మర్ స్పెషల్: ఒక్క కప్పు రవ్వతో వందల అప్పడాలు! కరకరలాడే సుజీ పాపడ్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.

సమ్మర్ స్పెషల్: ఒక్క కప్పు రవ్వతో వందల అప్పడాలు! కరకరలాడే సుజీ పాపడ్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.


వేసవిలో వడియాలు, అప్పడాలు పెట్టుకునే వారికి ఈ పక్కా కొలతలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రవ్వను సరిగ్గా ఉడికించడం, జీలకర్రను చివర్లో కలపడం వంటి చిట్కాలు అప్పడాలు తెల్లగా, పల్చగా రావడానికి బాగా తోడ్పడతాయి. వేసవి కాలంలో ఇంట్లోనే సులభంగా, తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలిగే రవ్వ అప్పడాల (Suji Papad) రెసిపీ ఇక్కడ ఉంది. ఇవి ఎంతో కరకరలాడుతూ, రుచిగా ఉంటాయి. వీటి తయారీ కోసం కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం…

బొంబాయి రవ్వ (సుజీ) – 1 కప్పు

నీరు – 7 నుండి 8 కప్పులు

ఇవి కూడా చదవండి

జీలకర్ర – 1 స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా (తక్కువగా వేయాలి, ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది)

వాము లేదా చిల్లీ ఫ్లేక్స్ – కొద్దిగా (ఆప్షనల్)

తయారీ విధానం:

ఒక పెద్ద గిన్నెలో 7 కప్పుల నీటిని పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు రవ్వను ఉండలు కట్టకుండా కలుపుతూ కొద్దికొద్దిగా వేయాలి. మంటను తగ్గించి, రవ్వ మిశ్రమం పారదర్శకంగా (Transparent), చిక్కగా అయ్యే వరకు సుమారు 10-15 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో జీలకర్ర, ఉప్పు, వాము కలపాలి. వేడి మీద జీలకర్ర వేస్తే అప్పడాల రంగు మారుతుంది, కాబట్టి చివరలో వేయడం మంచిది.

ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్‌కు కొద్దిగా నూనె రాసి, గరిటెతో కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని పల్చగా రౌండ్‌గా పరచాలి. వీటిని ఎండలో రెండు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. రెండో రోజు అప్పడాలను వెనక్కి తిరగేయాలి. పూర్తిగా ఎండిన అప్పడాలను గాలి చొరబడని డబ్బాలో దాచుకుంటే ఏడాది పాటు తాజాగా ఉంటాయి. మీరు పప్పు చారు లేదా సాంబార్ చేసుకున్నప్పుడు వీటిని వేయించుకుని తింటే ఆ రుచే వేరు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *