శ్రీరామ నగరంలో వైభవంగా సాగుతున్న 1009వ తిరునక్షత్ర వేడుకలు.. లైవ్ వీడియో

శ్రీరామ నగరంలో వైభవంగా సాగుతున్న 1009వ తిరునక్షత్ర వేడుకలు.. లైవ్ వీడియో


1009th Tirunakshatra Celebrations: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరంలోని స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో ‘శ్రీ భగవద్ రామానుజచార్య స్వామి వారి 1009వ తిరునక్షత్ర వేడుకలు’ భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనుగ్రహ భాషణాలు కొనసాగుతున్నాయి. ఇక, మొదటి రోజు సాయంత్రం “విశ్వరూపధర రామానుజ” శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. శంషాబాద్ నుంచి స్ట్యాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు భాగ్యనగర పరిసరాల దివ్య ఆలయాల నుంచి భగవద్ రామానుజ మూర్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ముచ్చింతల్ శ్రీరామ నగరం సమతామూర్తి ప్రాంగణంలో భక్తుల నినాదాల మధ్య మూర్తులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివ్యదేశ పెరుమాళ్ దర్శనం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

162 దివ్యదేశాల ప్రతీకగా 162 రూపాల్లో విశ్వరూపధర రామానుజ దర్శనం కల్పించడాన్ని విశేషంగా పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జీవించాలని ఆకాంక్షించారు. వేదికపై ఏర్పాటు చేసిన 162 శ్రీ భగవత్ రామానుజ మూర్తులకు ఘనంగా ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. కార్యక్రమాలకు భారీగా భక్తజనులు హాజరయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *