వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌! స్పెషల్‌ ట్రైన్స్‌ టైమ్‌ టేబుల్‌ ఇదే!

వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌! స్పెషల్‌ ట్రైన్స్‌ టైమ్‌ టేబుల్‌ ఇదే!


వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌! స్పెషల్‌ ట్రైన్స్‌ టైమ్‌ టేబుల్‌ ఇదే!

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి – సంత్రాగాచి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెలలో పలు తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రైల్వే వివరాల ప్రకారం.. రైలు నంబర్‌ 07668 చెర్లపల్లి నుంచి సంత్రాగాచి వరకు ఏప్రిల్ 16, 22, 26, 29 తేదీల్లో ఉదయం 10:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 07669 సంత్రాగాచి నుంచి చెర్లపల్లి వరకు ఏప్రిల్ 17, 23, 27, 30 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10:00 గంటలకు చేరుకుంటుంది.

అదే విధంగా రైలు నంబంర్‌ 07671 చెర్లపల్లి–సంత్రాగాచి ప్రత్యేక రైలు ఏప్రిల్ 13, 17, 20, 24, 27, 30 తేదీల్లో నడవనుండగా, రైలు నంబర్‌ 07672 సంత్రాగాచి–చెర్లపల్లి ప్రత్యేక రైలు ఏప్రిల్ 14, 18, 21, 25, 28 తేదీలతో పాటు మే 1న కూడా నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రఖ్, బాలాసోర్, ఖర్గ్‌పూర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో 2ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని సర్వీసుల్లో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఏప్రిల్ 12, 13 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *