విజయవాడలో పెట్రోల్ సెగ..విజయవాడలో పెట్రోల్ సెగ

విజయవాడలో పెట్రోల్ సెగ..విజయవాడలో పెట్రోల్ సెగ


విజయవాడలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరింది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి, పెట్రోల్, డీజిల్ నిల్వలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిజిహెచ్ ఆసుపత్రి సమీపంలోని ఒక బంకు వద్ద ఇంధనం లేకపోవడంతో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా, బంకు చుట్టూ తాడు కట్టి మూసివేశారు.నగరంలోని కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే లభిస్తుండగా, మరికొన్నింటిలో డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంధన కొరతకు ప్రధాన కారణం పెట్రోలియం కంపెనీలు డీలర్లకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడమే. గతంలో డీలర్లకు అప్పుగా స్టాక్ ఇచ్చే కంపెనీలు, ఇప్పుడు నగదు చెల్లిస్తేనే స్టాక్ ఇస్తామని కరాకండిగా చెప్తున్నాయి. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ అందిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.దీంతో డీలర్లు ఇంధనం కొనుగోలుకు అవసరమైన నగదు సర్దుబాటు చేయలేక, స్టాక్ తీసుకురావడానికి జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో వాహనదారులు బంకుల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *