Headlines

వారానికి రెండుసార్లు ఈ గంజి తాగండి.. ఒళ్ళు నొప్పులు పటాపంచల్!


రోజంతా ఆఫీస్ పని, ఇంట్లో పనులతో అలసిపోయి సాయంత్రానికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా? పెయిన్ కిల్లర్స్ వాడకుండా సహజ సిద్ధంగా ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి మన సాంప్రదాయ ఆహార పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పోషకాలు నిండిన ధాన్యాల గంజి వారానికి రెండుసార్లు తాగడం వల్ల ఒళ్ళు నొప్పుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ గంజి ప్రత్యేకత ఏమిటి?:

సాంప్రదాయ బియ్యం రకాలు లేదా రాగులు, జొన్నలు, సామలు వంటి తృణధాన్యాలను నానబెట్టి తయారుచేసే ఈ ఆరోగ్యకరమైన గంజిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పూర్వకాలంలో మన పెద్దలు ప్రతిరోజూ ఇలాంటి గంజి తాగడం వల్లే ఎంతో బలంగా, నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ గంజిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, కీళ్ల నొప్పులు,  కండరాల బలహీనతను తగ్గిస్తాయి. ఇందులో లభించే ఐరన్ కంటెంట్ రక్తంలో హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగై అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి



ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గి శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి.

ఎలా తీసుకోవాలి?:

ఉదయాన్నే టిఫిన్‌కు బదులుగా లేదా సాయంత్రం వేళల్లో ఈ వేడి వేడి ధాన్యాల గంజిలో కాస్త మజ్జిగ, ఉల్లిపాయ లేదా ఇంగువ కలిపి తీసుకుంటే రుచితో పాటు పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఈ అలవాటు చేసుకుంటే ఒళ్ళు నొప్పుల సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *