వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్‌.. తల, మొండెం లేకుండానే..

వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్‌.. తల, మొండెం లేకుండానే..


ఏఐ మన జీవితాలను సులభతరం చేస్తోంది. విద్యార్థులు, యువత AIతో కొత్త ఆవిష్కరణలు చేయడం చూస్తున్నాం. గుజరాత్‌లో ఓ యువకుడు “ఘోస్ట్ సైకిల్”ను తయారుచేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. మనం ఇప్పటికే డ్రైవర్​ లేకుండా కదిలే టెస్లా కారును చూశాం. సరిగ్గా అలాగే సూరత్ లోని యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌ను కలిపి ఎవరూ నడపకుండానే స్వయంగా రోడ్లపై ప్రయాణించే సైకిల్‌ను తయారు చేశాడు. ఈ వింతను చూసిన వాహనదారులు ముందు జడుసుకున్నారు. ఆ తర్వాత ముచ్చటేసి ‘ఘోస్ట్​ సైకిల్​’ అని పేరు పెట్టారు. శివమ్ మౌర్య తన పార్టనర్​ గుర్‌ప్రీత్ అరోరాతో కలిసి మూడు నెలలు కష్టపడ్డాడు. దాదాపు రూ.35,000 ఖర్చుతో తయారైన ఈ సైకిల్, సాధారణ ప్రయోగంగా కాకుండా సాంకేతిక అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా నిలిచింది. ఒక మనిషి సైకిల్ నడపే సమయంలో దాన్ని బాలెన్స్​ చేయడం ఎంతో ముఖ్యం. అదే విధంగా మనిషి లేకుండా స్వయంగా కదులుతున్న ఆ సైకిల్​ కూడా తనంతట తానే బాలెన్స్​ చేసుకోవడం ప్రత్యేకం. ఈ సైకిల్‌లోని పెడలింగ్ వ్యవస్థ చూసేవారిని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఆ సైకిల్​ ముందుకు కదులుతుంటే మనిషి కాళ్లు పెడల్‌ను తొక్కుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు కారణం శివమ్​ రూపొందించిన యాంత్రిక వ్యవస్థ. ఈ సైకిల్ ను రోడ్లపై పరీక్షించినప్పుడు ఎవరూ లేకుండానే సైకిల్ కదలడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భవిష్యత్తులో డెలివరీ రోబోల వంటి ఆవిష్కరణలకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైకిల్​ ఎలా నడుస్తుంది అంటే.. మొబైల్ యాప్ : స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సైకిల్‌ను నియంత్రించవచ్చు చేతిలో పట్టుకునే రిమోట్‌తో దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చు. ఏఐ మోడ్​ ద్వారా సైకిల్​ ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందులో అమర్చిన సెన్సార్లు ఎదురుగా ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని గుర్తించి, తన మార్గాన్ని స్వయంగా మార్చుకునే విధంగా పనిచేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు

వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!

వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..

ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే

100 అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ.. మెడలో వేసుకున్న వరుడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *