Headlines

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ మూడు ఒకే ప్లాన్‌లో.. మెటా one ధరలు, ఫీచర్లు ఇవే!


మూడు యాప్స్‌కు విడివిడిగా ప్లాన్​లు తీసుకునే బదులు ఒకే ప్లాన్‌తో అదనపు సదుపాయాలు పొందే అవకాశం ఇప్పుడు వచ్చింది. Meta Oneలో సాధారణ వినియోగదారుల కోసం కోర్, ప్రీమియం ప్లాన్‌లు ఉన్నాయి. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా మరో నాలుగు ప్లాన్‌లు ఉన్నాయి. ధరలు, సదుపాయాలు ఒక్కో ప్లాన్‌లో వేర్వేరుగా ఉంటాయి.

రూ.549 నుంచి ప్లాన్‌లు..

ఇండియాలో కోర్ ప్లాన్ నెలకు రూ.549గా ఉంది. ప్రీమియం ప్లాన్ ధర రూ.1,960. ప్రస్తుతం విడిగా తీసుకుంటే వాట్సప్ ప్లస్ రూ.79, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ఒక్కొక్కటి రూ.99గా ఉన్నాయి. మూడు యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఒకే చందాలో అదనపు ఫీచర్లు పొందే అవకాశం ఈ ప్లాన్‌తో వస్తుంది.

కోర్ ప్లాన్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను కొత్త రూపంలో మార్చుకునే సదుపాయం, వాయిస్ ఎఫెక్ట్స్ వంటి సృజనాత్మక సాధనాలు ఉన్నాయి. మెటా ఏఐతో చిత్రాలు, వీడియోలు తయారు చేసుకునే పరిమితి కూడా పెరుగుతుంది. ప్రీమియం ప్లాన్‌లో ఏఐ సాధనాల వినియోగ పరిమితి మరింత ఎక్కువగా ఉంటుంది.

వ్యాపారాలు, క్రియేటర్లకు..

వ్యాపారాల కోసం ఎసెన్షియల్ ప్లాన్ నెలకు రూ.639 నుంచి మొదలవుతుంది. వాట్సప్ బిజినెస్‌లో మెటా బిజినెస్ ఏజెంట్ ద్వారా కస్టమర్లకు స్పందించడం, వెరిఫైడ్ బ్యాడ్జ్, వెరిఫైడ్ ఛానల్, నకిలీ ఖాతాల నుంచి రక్షణ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ప్లాన్ ధర రూ.2,099. ఇందులో స్టోరీస్ ముందుగానే షెడ్యూల్ చేయడం, పోస్టులు, రీల్స్‌లో లింకులు, విశ్లేషణ వివరాలు, ప్రేక్షకుల సమాచారం వంటి అదనపు సాధనాలు వస్తాయి. క్రియేటర్ల కోసం ఎక్స్‌పర్ట్ ప్లాన్ రూ.6,399, మ్యాక్స్ ప్లాన్ రూ.20,990గా ఉన్నాయి. వీటిలో మెటా బిజినెస్ ఏజెంట్‌కు మరిన్ని అధునాతన సదుపాయాలు అందుతాయి. మూడు యాప్స్‌ను ఎక్కువగా వాడేవారు, ఏఐ సాధనాలు లేదా వ్యాపార సదుపాయాలు అవసరమైనవారు తమ అవసరాన్ని బట్టి ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే నెలవారీ ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో ఉపయోగించే ఫీచర్లను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *