Headlines

లక్ష పెట్టుబడి పెడితే.. అక్షరాల 2 లక్షలు అవుతాయ్..! మీ డబ్బును డబుల్ చేసే గ్యారెంటీ స్కీమ్..


సురక్షితమైన, రిస్క్ లేని పెట్టుబడుల కోసం వెతికే ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ పథకాలు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఎలాంటి మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా, కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఖచ్చితమైన రాబడిని అందించే స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర (KVP) ఒకటి.. పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలంలో డబ్బును రెట్టింపు చేయాలనుకునే వారికి ఈ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ స్కీమ్ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం..

Kisan Vikas Patra – ఆకర్షణీయమైన వడ్డీ రేటు

ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 7.5% వడ్డీ రేటును అందిస్తోంది.

115 నెలల్లో డబ్బు రెట్టింపు:

ఈ వడ్డీ రేటు ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడి సరిగ్గా 115 నెలల్లో (9 సంవత్సరాల 7 నెలలు) రెట్టింపు (Double) అవుతుంది.

ఉదాహరణకు: మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి రూ.2 లక్షలు అందుతాయి.

పెట్టుబడి పరిమితులు..

కిసాన్ వికాస్ పత్ర పోస్టాఫీసు పథకాన్ని రూ. 1,000 నుండి ప్రారంభించవచ్చు.. ఈ పథకంలో గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. మీ వద్ద ఉన్న ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఎవరు ఖాతా తెరవవచ్చు?

18 ఏళ్లు పైబడిన ఏ భారతీయ నివాసి అయినా ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు… ఒకే ఖాతాలో గరిష్ఠంగా ముగ్గురు పెద్దలు (Adults) కలిసి జాయింట్ అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్లు తమ పిల్లల (మైనర్లు) పేరిట ఖాతాను నిర్వహించవచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్లు తమ సొంత పేరిట కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో..

అయితే.. మీరు డిపాజిట్ చేసిన సమయంలో ఉన్న వడ్డీ రేటే మెచ్యూరిటీ ముగిసే వరకు మార్పు లేకుండా వర్తిస్తుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక పథకమైనప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన రెండున్నరేళ్ల (30 నెలల) తర్వాత నిబంధనలకు లోబడి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అత్యవసర నిధుల కోసం KVP సర్టిఫికెట్‌ను గ్యారెంటీగా (Collateral) పెట్టి బ్యాంకులలో రుణాలు (Loans) పొందవచ్చు.

టాక్స్ ప్రయోజనాలు ఉండవు..

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. అలాగే వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. వ్యక్తిగత శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు..

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అధిక రిస్క్ ఉండే సాధనాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని వారికి, తమ కష్టార్జితం సురక్షితంగా ఉంటూనే రెట్టింపు కావాలనుకునే వారికి పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని పేర్కొంటున్నారు మార్కెట్ నిపుణులు.. అయితే, పెట్టుబడికి ముందు తాజా నిబంధనలు, పన్ను ప్రభావాలను పరిశీలించడం ఉపయోగకరం..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *