Headlines

రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. అక్టోబర్‌ 12 వరకే ఛాన్స్!


రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. అక్టోబర్‌ 12 వరకే ఛాన్స్!

వారణాసిలోని Banaras Locomotive Works (BLW) 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా (ఓపెన్ అడ్వర్టైజ్‌మెంట్) కింద ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 12, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, రెజ్లింగ్‌, హ్యాండ్‌బాల్‌ విభాగాలకు చెందిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • లెవెల్‌ 5 పోస్టుల సంఖ్య: 2
  • లెవెల్‌ 2 పోస్టుల సంఖ్య: 8
  • లెవెల్‌ 1 పోస్టుల సంఖ్య: 15

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగి ఉండాలి. దీంతోపాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడా అర్హతలను కూడా సాధించి ఉండాలి. కేటగిరీ-ఎ, బీ, సీ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు అర్హత సాధించే అవకాశం ఉంది. అంటే ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం, అలాగే కేటగిరీ-బీ/సీ పోటీలు, నేషనల్‌ గేమ్స్‌, ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లలో కనీసం మూడో స్థానం సాధించడం లేదా సీనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో మొదటి స్థానం పొందడం వంటి క్రీడా అర్హతలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం లెక్కిస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 12, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో స్పోర్ట్స్‌ ట్రయల్స్‌ కీలకంగా ఉంటాయి. అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ట్రయల్స్‌కు పిలిచి, వారి క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే ముందు విద్యార్హతలు, క్రీడా అర్హతలు, వయోపరిమితి తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

BLW రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *