రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా

రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా


163 మంది చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును రైల్వే పోలీసులు బయటపెట్టారు. బిహార్‌ నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా తరలిస్తున్న 163 మంది బాలురను మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్‌లో రక్షించారు. ఆరు నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఈ పిల్లలను లాతూర్‌లో కూలి పని కోసం బిహార్ నుంచి తరలిస్తున్నట్లు బాలల సంక్షేమ కమిటీ సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసు దళాల సాయంతో చిన్నారులను రక్షంచారు. ఆదివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని కట్ని రైల్వే స్టేషన్‌కు ఆ రైలు చేరుకుంది. దీంతో ఐదో నంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. ఆరు నుంచి 13 ఏళ్ల వయస్సున్న 163 మంది బాలురను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన టిక్కెట్లు, పత్రాలు లేకపోవడంతో ఆ పిల్లలను తీసుకెళ్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్నా-పూర్ణ ఎక్స్‌ప్రెస్‌లో సరైన టికెట్లు, పత్రాలు లేకుండా 163 మంది బాలురతో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిని రైల్వే పోలీసులు కట్నీ రైల్వే స్టేషన్‌లో అడ్డగించారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మదరసాకు తీసుకెళుతున్నట్లు బుకాయించినా మైనర్లను కూలి పనులు చేయించడానికి లాతూర్‌కు తీసుకువెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు నుంచి రక్షించిన 163 మంది బాలుర వయస్సు, గుర్తింపు, ప్రయాణం గురించి పోలీసులు తెలుసుకున్నారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు. దీంతో కొంత మంది పిల్లలను కట్నీ, మరికొందరిని జబల్‌పూర్‌లోని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. వారి తల్లిదండ్రులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రక్షించిన పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. వందలాది మంది పిల్లలను పాట్నా-పూర్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు పిల్లల సంక్షేమ కమిటీ సమాచారం ఇచ్చింది. దీంతో రైల్వే, ప్రభుత్వ పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం

ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం

గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు

ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *