Headlines

రెండు కప్పుల ఎర్ర గోధుమ రవ్వతో చేసే స్వీట్ 5 నిముషాల్లోనే రెడీ..


గోధుమ రవ్వ చక్కగా ఉడికిన తర్వాత, ఒకసారి అంతా కలిపేసుకుని, ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేయండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్లు అదనంగా వేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగే వరకు గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత, కేశరి రంగు మారి, మరింత మెరుస్తూ కనిపిస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత, మళ్లీ మూత పెట్టి, మంటను తక్కువకు తగ్గించి, ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుని, మరింత రుచికరంగా మారుతుంది. మిశ్రమం కొంచెం దగ్గర పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకుల పొడి, అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపాలి. నెయ్యి కలపడం వల్ల కేశరికి మంచి సువాసన వస్తాయి. ఆ తరవాత స్టవ్ ఆఫ్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *