Headlines

రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉద్యోగాలు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Notification No. 11/2026 కింద ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తం 8 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ సెప్టెంబరు 15, 2026న విడుదలైంది. ఫొరెన్సిక్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నిర్దేశిత విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగాలను బట్టి ఇంజినీరింగ్, సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్ విద్యార్హతలు అవసరం. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు తమకు సంబంధించిన పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు, స్పెషలైజేషన్, ఇతర అర్హత నిబంధనలను పూర్తి నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనం లభించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, రిజర్వేషన్, పరీక్ష విధానం తదితర నిబంధనలను పరిశీలించడం మంచిది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 6, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 27, 2026.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *