Headlines

రాత్రి 10 గంటల తరువాత శరీరంలో జరిగేది తెలిస్తే.. ఇకపై ఆ తప్పులు చేయరు! జీవ గడియారం ప్రాముఖ్యత


మన శరీరం రోజంతా ఒక యంత్రంలా పనిచేస్తుంది. అయితే, పగటిపూట నిరంతరం శ్రమించే శరీరానికి రాత్రి వేళ విశ్రాంతి, అంతర్గత శుద్ధి చాలా అవసరం. మన శరీరంలో 24 గంటల పాటు పనిచేసే సహజమైన వ్యవస్థనే సర్కేడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ (జీవ గడియారం) అంటారు. రాత్రి 10 గంటల సమయానికి ఈ జీవ గడియారం సంకేతాల వల్ల మన శరీరంలో కీలక మార్పులు ప్రారంభమవుతాయి.

రాత్రి 10 గంటలకు శరీరంలో ఏం జరుగుతుంది?: మేలోటోనిన్ హార్మోన్ విడుదల: చీకటి పడేకొద్దీ మెదడులోని పీనియల్ గ్రంథి మేలోటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను స్రవిస్తుంది. రాత్రి 10 గంటల సమయానికి దీని స్థాయిలు పెరిగి, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది శరీరాన్ని గాఢ నిద్రకు సిద్ధం చేస్తుంది.

అంతర్గత అవయవాల మరమ్మత్తు: రాత్రి వేళ శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లగానే కాలేయం, రోగనిరోధక వ్యవస్థ మరియు కణాలు తమను తాము శుద్ధి చేసుకునే, మరమ్మత్తులు చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి



జీర్ణక్రియ మందగించడం: రాత్రి 10 గంటల తర్వాత జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఈ సమయంలో ఆహారం తింటే అది సరిగ్గా అరగక, కొవ్వుగా మారి బరువు పెరగడానికి దారితీస్తుంది.

జీవ గడియారం దెబ్బతింటే జరిగే నష్టాలు: మానసిక ఒత్తిడి, చిరాకు: వేళకు నిద్రపోకపోవడం వల్ల కోర్టిసోల్ పెరిగి అలసట, చిరాకు, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి.

హార్మోన్ల అసమతుల్యత: రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల జీవక్రియ దెబ్బతిని, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది.

మెదడు మందగించడం: సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు ఏకాగ్రత లోపించి, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. సహజ సిద్ధమైన ఆరోగ్యానికి రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం ఎంతో శ్రేయస్కరం. రాత్రి వేళల్లో గ్యాడ్జెట్లు, ప్రకాశవంతమైన వెలుగుకు దూరంగా ఉంటూ, వేళకు నిద్రపోవడం వల్ల జీవ గడియారం క్రమబద్ధంగా ఉండి, శరీరం పూర్తి ఆరోగ్యంతో, ఉత్సాహంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *