ఎలాంటి జీర్ణ సమస్యలు లేని ఆరోగ్యవంతులు రాత్రిపూట 100 నుంచి 150 గ్రాముల వరకు బొప్పాయిని తక్కువ పరిమాణంలో తినడం సురక్షితమని చెబుతారు. ఒకవేళ రాత్రి తిన్న తర్వాత అజీర్ణం, గుండెల్లో మంట లేదా కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే రాత్రివేళ మానేసి పగటిపూట తీసుకోవడం మేలు. అధిక ఫైబర్, పాపైన్ వల్ల మలబద్ధకం తగ్గడం, తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ వల్ల బరువు నియంత్రణకు సహకరించడం, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల అంతర్గత వాపులు తగ్గడం వంటి ప్రయోజనాలు బొప్పాయితో లభిస్తాయి.