బెల్లం గుడాన్నానికి కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల బెల్లం, రెండు కప్పుల నీరు, అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నాలుగు జీడిపప్పు, మూడు కిస్మిస్ లు తీసుకోవాలి ఇంకా రుచి కోసం దీనిలో ఉప్పు కూడా వేసుకోవాలి.
బియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలి: ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని వాటిని కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి వాటిని మెత్తగా ఉడికించాలి. ఇది కొంచెం ముద్ద లాగా ఉంటే గుడాన్నం మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే తినడానికి కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే బియ్యాన్ని మంచిగా ఉడికించాలి.
బెల్లం నుంచి పాకాన్ని ఇలా వేరు చేయాలి : ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద చిన్న పాత్ర పెట్టి, దానిలో బెల్లం తురుము లేదా బెల్లం ముక్కలు వేసి రెండు గ్లాసుల నీళ్ళు పోసి బాగా కరిగించాలి. వాటిని వడకట్టి దానిని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి.
అన్నం బాగా ఉడికిన తరవాత అన్నం వేసుకోవాలి: అన్నం బాగా ఉడికిన తర్వాత దానిలో బెల్లం పాకం కూడా పోసి మీడియం మంటపై ఉంచి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఒక గరిటె తీసుకుని దానిని బాగా తిప్పుకోవాలి అన్నం రెండు మెతుకులు అయ్యే వరకు స్పూన్ తో అంటూనే ఉండాలి.
ఇప్పుడు పాలు, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. మళ్ళీ చిన్న పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి నాలుగు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి గుడాన్నంలో వేయాలి. అలా 5 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే, వేడి వేడి గుడాన్నం రెడీ.




