యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్


గత ఆరు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం.. ఒక కీలక మలుపు తిరిగింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన త్వరలోనే వీడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణు కార్యక్రమాల్లో కీలకమైన ‘శుద్ధి చేసిన యురేనియం’ నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆయన వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. చర్చల్లో ఇదొక గొప్ప ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు. “నాలుగు వారాల పాటు సాగిన బాంబు దాడులు, శక్తివంతమైన ఆర్థిక దిగ్బంధనం వల్లే ఇరాన్ ఇప్పుడు మెత్తబడింది. వారు తమ యురేనియం నిల్వలను ఇవ్వడానికి అంగీకరించారు అంటూ ట్రంప్‌ తెలిపారు. ఈ వారాంతంలోనే తుది చర్చలు జరగవచ్చని, పరిస్థితులు చూస్తుంటే కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం కూడా రాకపోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో అణు కార్యకలాపాల నిలిపివేత కాలపరిమితిపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 20 ఏళ్ల పాటు అణు కార్యక్రమాలు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే ఇరాన్‌ మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే విరామం ఇచ్చేందుకు మొగ్గుచూపింది. తాజాగా తమ యురేనియం నిల్వల్లో కొంత భాగాన్ని దేశం వెలుపలికి తరలించేందుకు ఇరాన్ అంగీకరించడం ఒప్పందానికి మార్గం సుగమం చేసింది. ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌లను ట్రంప్ ప్రశంసించారు. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్‌లో జరిగితే తాను కూడా హాజరయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో, ఇరాన్ విషయంలో పోప్ లియో అనుసరిస్తున్న మెతక వైఖరిపై ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరాన్ చేతిలో అణ్వాయుధం ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వచ్చే వారంతో కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఒకవేళ ఈలోపు ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఈ శాంతి ప్రయత్నాలు సఫలమైతే గల్ఫ్ ప్రాంతంలో మరో యుద్ధం తప్పుతుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *