ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్

ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్


ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్

ఐపీఎల్ కారణంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ సమ్మర్ సీజన్ పూర్తిగా సందిగ్ధంలో పడింది. ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల ముఖ్యంగా శని, ఆదివారాల్లో థియేటర్లలో కలెక్షన్లు గణనీయంగా తగ్గుతున్నాయని సినీ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. దీని ఫలితంగా, అనేక పెద్ద చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి. నిజానికి, మార్చిలో విడుదల కావాల్సిన పలు సినిమాలు వెనక్కి వెళ్లగా, ఏప్రిల్ 30న రావాల్సిన చిత్రాలు కూడా ఇంకా నిరీక్షణలోనే ఉన్నాయి. భారీ అంచనాలున్న పారడైస్ చిత్రం మార్చి 26 నుండి ఏకంగా ఆగస్టు 21కి వాయిదా పడింది. అలాగే, ఎంతో హైప్ ఉన్న టాక్సిక్ కూడా సమ్మర్ నుండి జూన్ నెలకు షిఫ్ట్ అయింది. చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర తారలు సైతం తమ సినిమాలను ఐపీఎల్ తర్వాత విడుదల చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారు. క్రికెట్ ఫీవర్‌తో పోటీపడి కలెక్షన్లు నష్టపోవడం కంటే, టోర్నీ ముగిసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడమే మేలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సమ్మర్ బాక్సాఫీస్ దాదాపుగా ఖాళీగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొంగల్ పోటీ చూసారా.. ఈసారి దండయాత్రే..

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే

విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *