మీ పిల్లలు కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నారా? లేత మనసులపై ప్రభావం పడుతుందని తెలుసా

మీ పిల్లలు కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నారా? లేత మనసులపై ప్రభావం పడుతుందని తెలుసా


మీ పిల్లలు కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నారా? లేత మనసులపై ప్రభావం పడుతుందని తెలుసా

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దల కంటే పిల్లలపైనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు చూసి, పదేళ్ల ప్రాయం కూడా దాటని చిన్నారులు సైతం స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. తమ స్కూల్ బ్యాగుల్లో పెన్నులు, పుస్తకాలతో పాటు ఖరీదైన కాస్మెటిక్స్‌ను మోస్తున్న ఈ కొత్త తరం పిల్లలను నిపుణులు ‘సెఫోరా కిడ్స్’ (Sephora Kids) అని పిలుస్తున్నారు. కేవలం లాభాల కోసం కార్పొరేట్ కంపెనీలు చిన్నారుల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయనే ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

ఒక కొత్త మానసిక సమస్య

సౌందర్య ఉత్పత్తుల పట్ల పిల్లలు అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడాన్ని నిపుణులు ‘కాస్మెటికోరెక్సియా’గా పిలుస్తున్నారు. తమ రూపం పట్ల అభద్రతా భావం కలగడం, ఇతరులతో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియాలో చూసే మెరిసే ముఖాలే నిజమని నమ్మి, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు. ఇది కేవలం చర్మ సమస్యలకే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తీవ్రమైన మానసిక ఆందోళనలకు దారితీస్తోంది.

చర్మంపై రసాయనాల ప్రభావం

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పెద్దలు వాడే ఫేస్ మాస్క్‌లు, స్క్రబ్‌లు లేదా కెమికల్ సీరమ్‌లను వాడటం వల్ల వారి లేత చర్మంపై దద్దుర్లు, అలర్జీలు మరియు తీవ్రమైన చికాకు కలగవచ్చు. కార్పొరేట్ కంపెనీలు మూడు ఏళ్ల పిల్లలకు కూడా ఫేస్ మాస్క్‌లను ప్రమోట్ చేయడం అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహం. ఆరుబయట ఆడే పిల్లలకు కేవలం మినరల్ బేస్డ్ సన్‌స్క్రీన్ మినహా మరే ఇతర కాస్మెటిక్స్ అవసరం లేదని చర్మవైద్యులు హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలామంది తల్లులు తమ పిల్లల రంగు గురించి ఆందోళన చెందుతూ రకరకాల సబ్బులు, క్రీములు మారుస్తుంటారు. కానీ, పసిబిడ్డలకు పౌష్టికాహారం, సరైన నిద్ర మరియు ఆరుబయట ఆటలే అత్యుత్తమ స్కిన్ కేర్ అని గుర్తించాలి. పిల్లలను సోషల్ మీడియా ఆల్గారిథమ్‌ల బారి నుండి కాపాడుకుంటూ, అందంపై వారికి సరైన అవగాహన కల్పించాలి. ముఖానికి రంగు పూయడం కంటే మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యమని నేర్పించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *