మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉందా..? లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న పని చేయండి!

మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉందా..? లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న పని చేయండి!


మనీ ప్లాంట్, గవ్వలు రెండూ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్ మొక్కకు తెల్లని గవ్వలను (White Cowrie Shells) కట్టడం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అదేలాగో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలు:

గవ్వలు సముద్రం నుండి ఉద్భవిస్తాయి. అలాగే లక్ష్మీదేవి కూడా సముద్ర తనయ. అందుకే గవ్వలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. మనీ ప్లాంట్‌కు వీటిని కట్టడం వల్ల ఇంటికి అదృష్టం వరిస్తుంది.
గవ్వలను మనీ ప్లాంట్‌కు కట్టడం వల్ల ఆగిపోయిన ధనం తిరిగి వస్తుందని, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని నమ్ముతారు. ఇది ఇంట్లో అక్షయ పాత్ర వలె ధన ప్రవాహాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

అప్పుల బాధల నుంచి బయటపడాలనుకునే వారు ఈ పద్ధతిని పాటించడం శుభప్రదం. ఇది ఆర్థిక అస్థిరతను తొలగించి స్థిరత్వాన్ని ఇస్తుంది. మనీ ప్లాంట్‌కు శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. గవ్వలను మొక్కకు కట్టడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడి, లగ్జరీ, సుఖశాంతులు చేకూరుతాయి. గవ్వలకు ఉండే సహజమైన శక్తి వల్ల ఇంటిపై ఉన్న దిష్టి లేదా ప్రతికూల తరంగాలు తొలగిపోతాయి.

ఎలా కట్టాలి?: శుక్రవారం రోజున 5 లేదా 7 తెల్లని గవ్వలను తీసుకుని గంగాజలంతో శుద్ధి చేయాలి. వాటికి పసుపు, కుంకుమ పెట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత వాటిని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో లేదా ఎర్రటి దారంతో మనీ ప్లాంట్ కొమ్మకు లేదా కుండీకి కట్టాలి. శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచి, దానికి ఈ విధంగా గవ్వలను కట్టడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *