Headlines

మలయాళంలో ఏడాదికో ఇండస్ట్రీ హిట్.. వాట్ ఏ గ్రోత్..?


మలయాళ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డుల వేట ఎలా ఉందో చూస్తున్నారా..? ఏడాదికో సరికొత్త ఇండస్ట్రీ హిట్‌తో మాలీవుడ్ స్థాయి ఏ రేంజ్‌కు వెళ్తోందో గమనిస్తున్నారా..? కేరళ బాక్సాఫీస్‌కు మరో కొత్త ఇండస్ట్రీ హిట్ వచ్చింది. చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా రికార్డులను తిరగరాయడం వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటి..? ఒకప్పుడు 100 కోట్లకు తంటాలు పడ్డ మలయాళ సినిమా ఇప్పుడు వందల కోట్లు వసూలు చేస్తుంది. గత మూడేళ్లుగా వాళ్ల సినిమాలు రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్ రూ. 242 కోట్లు, ఎంపురాన్ రూ. 265 కోట్లకు పైగా వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా చరిత్ర సృష్టించాయి. మలయాళ సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసాయి. ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో సినిమా లోక ఛాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక కేరళ వరకు మాత్రమే చూసుకుంటే 2026లోనే వాళా 2 రూ. 126 కోట్లు కలెక్ట్ చేసి రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వాళా 2 రికార్డులను బెత్‌లెహమ్ కుడుంబ యూనిట్ దాటేసింది.. కేరళలోనే రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నివిన్ పౌలీ, మమితా బైజు కెమిస్ట్రీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా వాళ్ల మధ్య ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీకి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే రూ. 288 కోట్ల మార్క్‌ క్రాస్ చేసి.. లోక పేరు మీదున్న 300 కోట్లు అందుకోడానికి చూస్తుంది. రీజినల్ రికార్డులు కొల్లగొట్టిన బెత్‌లెహమ్.. లోక ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా ఈ వారమే క్రాస్ చేసేలా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. అప్పటి నుంచే అమలు

Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్

Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *