Headlines

మందార పువ్వులతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్.. ముడతలు పోయి ముఖం మెరిసిపోవడం ఖాయం!


చర్మ సౌందర్యం అనగానే మనకు రకరకాల ఖరీదైన క్రీములు, పార్లర్ ట్రీట్మెంట్లు గుర్తుకొస్తాయి. కానీ, మన ఇంటి ఆవరణలోనే లభించే మందార పువ్వులతో రూపాయి ఖర్చు లేకుండ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో మందార పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని సహజ బొటాక్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది చర్మంపై వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.

మందార పువ్వుల్లో ఉండే పోషకాలు:

మందార పువ్వులలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు,యు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, చనిపోయిన కణాలను తొలగిస్తాయి. అంతేకాకుండా చర్మంలో కొల్లాజెన్ ఉత్పాదనను పెంచి, ముఖంపై వచ్చే సన్నని గీతలు, ముడతలను నివారిస్తాయి.

మందార ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానాలు:

మందార, పెరుగు ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: ఫ్రెష్ మందార పూల రేకుల పేస్ట్ లేదా ఎండబెట్టిన మందార పొడి – 2 స్పూన్లు, పెరుగు – 1 స్పూన్.

ఇవి కూడా చదవండి



తయారీ: మందార పేస్ట్ లేదా పొడిలో పెరుగు కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

మందార, తేనె ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: మందార పొడి – 1 స్పూన్, తేనె – 1 స్పూన్, కొద్దిగా రోజ్ వాటర్.

తయారీ: ఈ మూడింటినీ బాగా కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తక్షణమే కాంతివంతంగా, కోమలంగా మారుతుంది.

మందార, అలోవెరా ఫేస్ ప్యాక్:

మందార రేకుల పేస్ట్‌లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గి చర్మం ప్రశాంతంగా మారుతుంది.

ప్రయోజనాలు:

చర్మాన్ని బిగుతుగా చేసి వయసు పైబడిన ఛాయలను తగ్గిస్తుంది. పిగ్మంటేషన్, నల్లటి మచ్చలను మాయం చేస్తుంది. చర్మానికి సహజమైన గ్లో తెస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సులువుగా అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *