Headlines

మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.? 15 రోజులకోసారి ఇది ఒక్క స్పూన్ ఇస్తే చాలు..

మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.? 15 రోజులకోసారి ఇది ఒక్క స్పూన్ ఇస్తే చాలు..


మనందరికీ ఇంట్లో మందారం మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది ఎదుర్కొనే సమస్య ఏమిటంటే.. మొక్క ఎదుగుదల లేకపోవడం లేదా పూలు చిన్నవిగా రావడం. మందారం మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సరైన ‘శిక్షణ’ ఇవ్వడం చాలా ముఖ్యం. మొదటగా, చిన్న కుండీల్లో కాకుండా కాస్త పెద్ద సైజు కుండీలను ఎంచుకోవాలి. మీరు పాత ఆయిల్ క్యాన్లను కూడా డ్రైనేజీ రంధ్రాలు చేసి వాడుకోవచ్చు, ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి. మొక్కకు శిక్షణ ఇచ్చేటప్పుడు, నేలకు తగిలేలా ఉన్న కింది కొమ్మలను కత్తిరించాలి. ఎందుకంటే చాలావరకు తెగుళ్లు నేల నుండే సంక్రమిస్తాయి. ప్రధాన కాండం చుట్టూ కొమ్మలు దట్టంగా రావాలంటే పై భాగాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క బుషీగా తయారై ఎక్కువ పూలు పూస్తుంది.

వర్షాకాలం వచ్చిందంటే మందారం ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. దీనికి కారణం మట్టిలో పోషకాలు వర్షపు నీటితో పాటు కొట్టుకుపోవడమే. అందుకే వర్షాలు తగ్గిన తర్వాత మొక్కలకు పోషకాలు అందించడం ముఖ్యం. మట్టిలో నీరు నిల్వ ఉండకుండా ‘వెల్ డ్రైన్డ్’ సాయిల్ మిక్స్ వాడాలి. వర్షం తగ్గాక మట్టిని కాస్త కదిలిస్తే ఫంగస్ చేరకుండా ఉంటుంది. మొక్కలకు బలాన్ని ఇచ్చే అద్భుతమైన ఎరువును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓట్స్, ఆవాలు, టీ పౌడర్ కలిపిన మిశ్రమం మొక్కలకు నైట్రోజన్, పొటాషియం లాంటి పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. ఓట్స్, ఆవాలను పొడి చేసి టీ పౌడర్ కలిపి ప్రతి 15 రోజులకు ఒక స్పూన్ చొప్పున మొక్కలకు ఇస్తే కొత్త చిగుళ్లు వచ్చి పూలు పెద్ద సైజులో పూస్తాయి.

ఇక తెగుళ్ల విషయానికి వస్తే, మందారానికి ప్రధాన శత్రువు ‘మిల్లిబగ్స్'(తెల్ల పురుగులు). వీటిని వదిలించుకోవడానికి వేపనూనె ద్రావణం లేదా వెల్లుల్లి తొక్కల ద్రావణం అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మిగిలిపోయిన అన్నం నీటిని 3-4 రోజులు పులియబెట్టి స్ప్రే చేస్తే మిల్లిబగ్స్ మటుమాయం అవుతాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ మందారం మొక్కలు ఏడాది పొడవునా పచ్చగా, నిండుగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *