
వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులు, అస్తవ్యస్తమైన రుతుపవనాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగా స్వరూపం వేగంగా మారుతోంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కురిసినా ఒకేసారి కుండపోతగా లేదా తీవ్ర వర్షాభావం నెలకొనడం వల్ల రైతులు సంప్రదాయ పంటల సాగులో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి భారతీయ రైతాంగం ఇప్పుడు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల వైపు తమ దృష్టిని సారిస్తోంది.
అస్తవ్యస్తంగా నైరుతి రుతుపవనాలు:
సాధారణంగా నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించి పంటలకు అనుకూలమైన వర్షపాతాన్ని అందిస్తాయి. కానీ, ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసి వరదలు రాగా, మెజారిటీ ప్రాంతాల్లో చుక్క నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. వర్షపాతంలో నెలకొన్న ఈ తీవ్ర అసమానత వల్ల రైతులు ఏ సమయంలో విత్తనాలు వేయాలో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
పంట దిగుబడిపై టర్మినల్ డ్రాట్ ప్రభావం:
రైతులు సకాలంలో పంటలు వేసినప్పటికీ, పంట ఎదుగుదలకు లేదా గింజ గట్టే కీలక సమయంలో వర్షాలు ముఖం చాటేస్తే దానిని టర్మినల్ డ్రాట్ అంటారు. వర్షపాతం మందగించడం వల్ల ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, జొన్న, పప్పుధాన్యాల సాగు తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రాజెక్టులలో, భూగర్భంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడం వల్ల వచ్చే రోజుల్లో తీవ్రమైన తాగునీటి, సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
ఆందోళనలో రైతాంగం:
ఏరువాక సాగిపోవాల్సిన సమయంలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల విత్తనాలు మొలకెత్తక ముందే ఎండిపోతున్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అంచనాలు కూడా తరచూ మారిపోతుండటంతో రాబోయే రోజుల్లో సాధారణ వర్షాలు కురుస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సవాలుగా మారిన వాతావరణ మార్పులు:
గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావాల వల్ల రుతుపవన వ్యవస్థలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, తక్కువ సమయంలోనే ఆకస్మికంగా కుండపోత వర్షాలు పడటం ప్రమాదకరంగా మారింది. వాతావరణంలో సంభవిస్తున్న ఈ ప్రతికూల మార్పులను తట్టుకోవడానికి ప్రభుత్వాలు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కరువు పీడిత ప్రాంతాలలోని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, నీటి యాజమాన్య సూచనలు అందించడం అత్య అత్యవసరం. అలాగే, పంట నష్టపోతున్న రైతాంగానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..