Headlines

భూములు రాసిచ్చాం.. కొడుకులు, కూతురు పట్టించుకోవడం లేదు.. పాపం కలెక్టరేట్‌లోనే..


భూములు రాసిచ్చాం.. కొడుకులు, కూతురు పట్టించుకోవడం లేదు.. పాపం కలెక్టరేట్‌లోనే..

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. చోర్‌పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు.. తమ సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న భూమిని.. వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. ఆ తర్వాత బిడ్డలందరూ మల్లయ్య దంపతులను పట్టించుకోవడం మానేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన మల్లయ్య దంపతులు.. తాము రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన భూమిని రద్దు చేయాలని కోరుతూ పలు మార్లు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు.

అయితే, ఆఫీసులో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఎన్నిసార్లు తిరిగినా, తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి ఒడిగట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని వేడుకున్నారు. కొడుకు, కూతుళ్లపై కేసు నమోదు చేసి సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేయస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో.. మల్లయ్య దంపతులు శాంతించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *