Headlines

బ్రేకింగ్, కలర్, ఇంజిన్ అన్నీ సరికొత్త టెక్నాలజీ! కవాసకి ఉల్కన్​ ధర తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి


క్రూయిజర్ బైక్ కొనాలనుకునే వారికి Vulcan S ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది. ఇప్పుడు 2027 వెర్షన్‌తో ఈ మోడల్‌లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. 649cc ఇంజిన్ కొనసాగినా టార్క్ పెరిగింది. మరోవైపు బ్రేక్ డిస్క్ పరిమాణం తగ్గింది. కొత్త రంగుతో ఈ బైక్ మరింత ప్రత్యేకంగా కనిపించనుంది.

ఇంజిన్‌లో టార్క్ పెంపు

2027 Vulcan Sలో 649cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది గరిష్టంగా 61hp పవర్, 62.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే 2026 మోడల్‌తో పోలిస్తే టార్క్‌ను 1.4Nm పెంచారు. పవర్, టార్క్ అందించే రెవల్యూషన్ పరిధిలోనూ మార్పు లేదు. దీంతో రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్‌లకు అనువైన సెటప్ కొనసాగుతోంది.

బ్రేకింగ్‌లో కీలక మార్పులు

బ్రేకింగ్ వ్యవస్థలో మాత్రం పరిమాణ మార్పు కనిపిస్తుంది. ముందు భాగంలో ఉన్న 300mm డిస్క్ స్థానంలో 272mm రోటర్‌ను ఇచ్చారు. వెనుక 250mm డిస్క్ స్థానంలో 216mm యూనిట్ వచ్చింది. అయితే డ్యూయల్ ఛానల్ ABS కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్ భద్రతా సదుపాయాల్లో కొత్త మార్పులు చేయలేదు.

సస్పెన్షన్ విషయంలో ముందు 41mm ఫోర్క్ 130mm ట్రావెల్‌ను అందిస్తుంది. వెనుక లింకేజ్ టైప్ మోనోషాక్ 80mm ట్రావెల్‌తో వస్తుంది. ప్రీలోడ్ సర్దుబాటు సౌకర్యం ఉంది. సీటు ఎత్తు 705mm కావడంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 130mm కాగా, కర్బ్ బరువు 235 కిలోలుగానే ఉంది.

కొత్త రంగులో మాత్రమే లభ్యం

2027 మోడల్‌లో Metallic Flat Spark Black స్థానంలో Metallic Carbon Gray రంగును అందించారు. ఇందులో బ్లూ, గ్రీన్ హైలైట్స్ ఉండటంతో ప్రత్యేకమైన రూపం కనిపిస్తుంది. కొత్త Vulcan S ధర రూ.8.23 లక్షలు. 2026 మోడల్ కంటే రూ.10,000 అధికం. ఇది Royal Enfield Super Meteor 650తో పోటీ పడనుంది. అయితే Super Meteor 650 ధర రూ.4.05 లక్షల నుంచి ప్రారంభమవుతుండటంతో రెండు మోడళ్ల ధరల మధ్య గణనీయమైన తేడా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *