బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??

బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??


బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జీవించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రోజువారీ ఖర్చులు భారంగానే ఉంటాయి. ప్రస్తుతం ప్రయాణ ఛార్జీలు, ఆహార ధరలు మండిపోతున్నాయి. తాజాగా ఓ యువతి 500 రూపాయలు బడ్జెట్‌లోనే తన రోజును గడిపేందుకు ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లుగా ప్లాన్‌ వేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. పశ్చిమబెంగాల్‌ యువతి ప్రియాంక మోండల్‌ బెంగళూరులో నివసిస్తున్నారు. తక్కువ ఖర్చుతో తన రోజును గడిపేందుకు రూ.500 బడ్జెట్‌గా కేటాయించుకున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ గా ఇడ్లీతో తన రోజును ప్రారంభించారు. వేరే చోటుకు వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేయకుండా మెట్రో, బస్సును ఎక్కారు. ఖరీదైన‌ హోటళ్లకు వెళ్లకుండా సాధారణ హోటల్ లో రూ.120కే లంచ్‌ ముగించారు. సాయంత్రం వడాపావ్‌, టీ కోసం కొంత మొత్తం ఖర్చు చేసారు. ఇక చివరికి ఇంటికి వెళ్లేసరికి ఆమె ప్యాకెట్‌లో రూ.200 మిగలడం విశేషం. సరైన ప్లానింగ్‌ ఉంటే ఖరీదైన నగరాల్లోనూ బడ్జెట్‌ లో జీవించొచ్చని ఆమె సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేసారు. దీనిపై కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందిరా క్యాంటీన్లు ఉన్న చోట్ల కేవలం రూ.30కే భోజనం లభిస్తుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలా తాను కూడా ప్రయత్నిస్తానంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేయడం విశేషం. బెంగళూరులో రోజురోజుకి ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి. అధిక మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ, తగిన ఇళ్లు దొరకడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. . కడుబీసనహళ్లికి 6 కిలోమీటర్ల పరిధిలో 1BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు ఎదురైన తమ అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్‌ చేసారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాదాపు రూ. 30,000 చెల్లించేందుకు రెడీ అయినప్పటికీ , సరైన బాల్కనీ, పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఫ్లాట్‌ దొరకడం కష్టంగా ఉందని అన్నారు. ఫ్లాట్లు రూ.28 వేల నుంచి రూ.32 వేలు అంతకంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయనీ అయితే సరైన బాల్కనీ లేదా ప్రత్యేక కార్ పార్కింగ్ వంటి బేసిక్ సౌకర్యాలు కూడా లేవనీ వాపోయారు. తనను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం ఇళ్లను చూపించే విధానమన్నారు. చాలా చోట్ల బాల్కనీ ఉందని చెబుతారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు, అది వాషింగ్ మెషీన్ పక్కన ఉండే ఒక చిన్న పని ప్రదేశంలా ఉంటుందనీ అది తప్పుదోవ పట్టించడమే అనీ అతను తెలిపాడు. తను మరీ అంత ఆడంబరమైన ఇళ్ల కోసం ఏమీ వెతకడం లేదన్నారు. కనీసం నిలబడటానికి లేదా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న బాల్కనీ, కార్ పార్కింగ్ ఉన్న ఒక సాధారణ 1BHK చాలనీ అయినా అలాంటివి అస్సలు దొరకడం లేదనీ దీన్నిబట్టి చూస్తే నగరంలో సరైన సౌకర్యాలున్న ఇంటిని వెతకడం పెద్ద టాస్క్‌గా అనిపిస్తుందనీ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *