బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు

బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు


బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు

తమన్నా గురించి మాట్లాడుకోగానే, ఆమె చేస్తు్న్న బయోపిక్‌ గురించి కూడా ప్రస్తావనకు వచ్చేస్తుంది. లెజండరీ బాలీవుడ్‌ దర్శకుడు వీ శాంతారామ్‌ బయోపిక్‌లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నారు తమన్నా. అలనాటి అందాల నటి జయశ్రీగా ఆమె మెప్పిస్తారనే మాట ఎప్పటి నుంచో ఉంది.. అంతకు మంచి వైరల్‌ అవుతోంది… మధుబాల బయోపిక్‌. ఒక్క సినిమా సక్సెస్‌ చాలు ఫేమస్‌ అయిపోవడానికి అనే మాటను చాలా సార్లు వింటుంటాం. కానీ, ఆ దక్కిన ఛాన్సుని మనం ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి మిగిలిన కేరక్టర్లు మనల్ని వెతుక్కుంటూ వస్తాయనే విషయం సారా అర్జున్‌ విషయంలో మరోసారి ప్రూవ్‌ అయింది. ధురంధర్‌లో ఆమె నటననకు ఫిదా అయిన సంజయ్‌లీలా భన్సాలీ.. లేటెస్ట్ గా మధుబాల కేరక్టర్‌లో నటించమని అడుగుతున్నారట. మధుబాల కేరక్టర్‌కి సారా అర్జున్‌ సరిపోతారా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, డోంట్‌ వర్రీ.. పర్ఫెక్ట్ ఛాయిస్‌ అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారట భన్సాలీ. అటు క్రేజీ బ్యూటీ కియారా కూడా ఇంట్రస్టింగ్ బయోపిక్‌కు సిద్ధమవుతున్నారు. ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న ఈ బ్యూటీ త్వరలో కెమెగా ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెజెండరీ హీరోయిన్‌ మీనా కుమారి బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు కియారా. మరో నార్త్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కూడా బయోపిక్‌ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరాఠి కళాకారిణి విఠాబాయి పాత్రలో నటించేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు శ్రద్ధా. గ్లామరస్‌ హీరోయిన్స్ అంతా ఒకేసారి వింటేజ్‌ టర్న్ తీసుకోవటంతో, త్వరలోనే తెరమీద వింటేజ్‌ వైబ్స్ గ్రాండ్‌గా ఫ్లాష్‌ కావడం గ్యారంటీ అంటోంది ఇండస్ట్రీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్‌ ఆలోచిస్తారా ??

Tamannaah Bhatia: మనసుకు నచ్చిందే చేస్తున్నానంటున్న తమన్నా

Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *