వర్షాకాలం మొదలైంది పొలాల్లో ఉన్న పాములు నెమ్మదిగా ఇళ్ళ మధ్యకు చేరతాయి అప్రమత్తంగా ఉండకపతే ప్రాణాలకే ప్రమాదం. మహానంది దేవస్థానం కాలనీలో ఓ పాము తిష్ఠ వేసింది. చివరికి ఎలా పెట్టుకున్నారో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
మహానంది దేవస్థానం కాలనీలో నాగుపాము హల్చల్ చేసింది. కాలనీలోని ఈశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో బాత్రూమ్లో నల్లనాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఇంట్లో పాము ఉన్న విషయాన్ని గుర్తించిన ఈశ్వర్ వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మోహన్ ఘటనాస్థలికి చేరుకుని,గంటపాటు శ్రమించి బాత్ రూమ్ లో దాక్కున్న నల్లనాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో పాము పట్టుబడటంతో ఈశ్వర్ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
పట్టుబడిన నాగుపామును స్నేక్ క్యాచర్ మోహన్ సమీపంలోని నల్లమల అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు.గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో అడవి ప్రాంతంలో ఉండాల్సిన పాములు నివాస గృహాలమద్య సంచరిస్తూండటం స్థానికులను భయాందోళన కు గురి చేస్తూంది.
ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా నిపుణుల సహాయం తీసుకోవాలని స్నేక్ క్యాచర్ మోహన్ సూచిస్తున్నారు.




