
సినిమాల్లో విలన్లను చిటికెలో ఊడ్చేసే దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అసలైన మైండ్ గేమ్ మొదలుపెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే, తమిళనాడులో పాతుకుపోయిన ద్రావిడ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా, తన పార్టీ అధికారంలోకి రావడానికి విజయ్ ఏకంగా కాంగ్రెస్ మద్దతు కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రతిపాదించారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) కూటమిలో భాగస్వామిగా ఉంది. మరి ఇలాంటి సమయంలో విజయ్ కోరికను కాంగ్రెస్ ఎలా స్వీకరిస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. డీఎంకేని ఢీకొట్టాలంటే ఒక బలమైన జాతీయ పార్టీ తోడుండాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.