ప్రకృతి మాయాజాలం..100 ఏళ్లుగా కురుస్తున్న చేపల వర్షం.. ఆ రహస్యం తెలిస్తే

ప్రకృతి మాయాజాలం..100 ఏళ్లుగా కురుస్తున్న చేపల వర్షం.. ఆ రహస్యం తెలిస్తే


ప్రకృతి మాయాజాలం..100 ఏళ్లుగా కురుస్తున్న చేపల వర్షం.. ఆ రహస్యం తెలిస్తే

ప్రపంచంలో కొన్ని ప్రకృతి ఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి విచిత్రమైన ఘటనలలో ఒకటి ఆకాశం నుంచి చేపలు పడటం. అది కూడా ఒకసారి, రెండు సార్లు కాదు.. ఏకంగా వందేళ్లుగా ఇదే వింత విషయం కొనసాగుతూ వస్తోంది. ఈ వింత దృగ్విషయం మధ్య అమెరికాలోని హోండురాస్ దేశంలో గత 100 ఏళ్లకు పైగా జరుగుతూ వస్తోంది. దీనిని స్థానికులు ల్లు‌వియా డే పెసెస్ అని పిలుస్తారు. దీని అర్థం స్పానిష్ భాషలో చేపల వర్షం. అలా కురిసిన చేపలను ప్రజలు సేకరించి ఇంటికి తీసుకెళ్లి హ్యాపీగా వండుకుని తింటారు. ఇదంతా ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారింది.

హోండురాస్‌లోని యోరో ప్రాంతంలో సాధారణంగా ప్రతి సంవత్సరం మే నుంచి జూలై మధ్య భారీ వర్షాలు పడే సమయంలో ఈ సంఘటన జరుగుతుందని చెబుతారు. భారీ వర్షం, గాలి తుఫాన్లు వచ్చిన తర్వాత ఉదయం ప్రజలు బయటకు వెళ్లి చూస్తే నేలపై కుప్పలు తెప్పలుగా చేపలు కనిపిస్తాయి. అవి ఇంకా సజీవంగా ఉండటం కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంఘటన ఎలా జరుగుతుందనే విషయంలో శాస్త్రవేత్తలు కొన్ని వివరణలు ఇచ్చారు.

శాస్త్రవేత్తల ప్రకారం, హోండురాస్ అట్లాంటిక్ మహాసముద్రం నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రం లేదా నదుల్లో ఉన్న చిన్న చేపలను వాటర్‌స్పౌట్ లేదా బలమైన గాలివానలు పైకి లేపి మేఘాల్లోకి తీసుకెళ్తాయి. తరువాత వర్షం పడే సమయంలో అవి నేలపై పడిపోతాయి. ఈ కారణంగా ఆకాశం నుంచి చేపలు పడుతున్నట్టు కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే వర్షం తర్వాత భూమిపై చేపలు కనిపిస్తాయి. అయితే, ఈ సిద్ధాంతానికి సంబంధించి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కనిపించే చేపలు మంచినీటివి. అందుకే ఈ దృగ్విషయం నేటికీ పూర్తి రహస్యంగానే ఉంది.

శాస్త్రవేత్తలు ఈ దృగ్విషయాన్ని సహజ ప్రక్రియగా అభివర్ణించినప్పటికీ, స్థానికులు మాత్రం వారి స్వంత నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఇదంతా వారు దేవుని అద్భుతంగా నమ్ముతారు. వారి నమ్మకం ప్రకారం, 19వ శతాబ్దంలో ఒక స్పానిష్ పూజారి పేదలు, ఆకలితో ఉన్నవారి కోసం మూడు పగళ్లు, రాత్రుళ్లు నిరంతరం ప్రార్థిస్తూ వారికి ఆహారం అందించమని దేవుడిని కోరాడు. ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారిందని, భారీ వర్షంతో పాటు చేపలు కురవడం ప్రారంభించాయని చెబుతారు. అప్పటి నుండి, ఈ ప్రత్యేకమైన దృగ్విషయం ప్రతి సంవత్సరం సంభవిస్తుంది. ప్రజలకు విశ్వాసం, ఆశ్చర్యానికి మూలంగా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *