పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?


పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక డిఫరెంట్ ఫేజ్ లో ఉన్నారు. చేతిలో కథలున్న డబుల్ స్మార్ట్ ఎఫెక్ట్ తో పూరి ఇమేజ్ బాగా డ్ామేజ్ అయింది. అందుకే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బౌండరీ దాటి విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఎదురు చూస్తున్నారు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కెరీర్ కు ఏజెంట్ తర్వాత సడన్ బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన అది సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడన్నా క్లారిటీ లేదు. దీంతో సురేందర్ రెడ్డి కెరీర్ ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆచార్య తర్వాత దేవరతో హిట్ ఇచ్చిన కొరటాల కెరీర్ విషయంలో క్లారిటీ రావడం లేదు. చాలా రోజులుగా దేవరట పెండింగ్ లో ఉంది. రీసెంట్ గా బాలయ్యతోను ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులతో మళ్ళీ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ మాస్ డైరెక్టర్. బాక్స్ ఆఫీస్ లెక్కలు మారితేనే ఈ దర్శకుల భవిష్యత్తు మీద క్లారిటీ వస్తుంది. మరి ఈ విషయంలో వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *