పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం


డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక అద్భుత ఘటన చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పూజారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి పూజారి కుటుంబ సభ్యులు పూజ గదిలోకి వెళ్లగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. పూజ గదిలోని సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న చెంబులోకి ప్రవేశించిన ఒక భారీ నాగుపాము పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. అటు భయం.. ఇటు భక్తితో ఇంట్లోని వారు హడలిపోయారు. తమ ఇంట ఉన్న సీతారాముల ప్రతిమల వద్ద ఇలా నాగుపాము దర్శనమివ్వడం తమ అదృష్టమంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు పూజారి కుటుంబ సభ్యులు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా, అక్కడి నుండి వెళ్లడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నట్టుగా ఆ నాగుపాము అస్సలు దొరకలేదు. ఆ స్నేక్ క్యాచర్‌కి చిక్కకుండా బుసలు కొడుతూ చాలాసేపు ముప్పుతిప్పలు పెట్టింది. సుమారు గంటన్నర పాటు శ్రమించి, ఎట్టకేలకు ఆ పామును సురక్షితంగా డబ్బాలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లోని పూజగదిలో నాగుపాము కనిపించడం శుభసూచకమని, దైవలీల అని భక్తులు చర్చించుకుంటున్నారు. అలాగే వేసవి కాలం కావడంతో వేడిని తట్టుకోలేక పాములు జనావాసాల్లోకి, ముఖ్యంగా ఇళ్లలోని ఫ్రిజ్‌ల కింద, కిచెన్ గదుల్లోకి వస్తుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు.. వదిలేసి వెళ్లిన విమానం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *