Headlines

పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. సీరియల్ బ్యూటీ కోరిక


బుల్లితెరపై తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే కొందరు మాత్రం సీరియల్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ షోల ద్వారా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో కన్నడ భామ కావ్యశ్రీ ఒకరు. ‘గోరింటాకు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు సీరియల్స్, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. కావ్య షేర్ చేసే ఫోటోలు, రీల్స్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్యశ్రీ.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని, అలాగే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో పాల్గొనే అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే కావ్యశ్రీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది.. ఆయనను నటుడిగానే కాకుండా నాయకుడిగా కూడా తాను ఎంతో అభిమానిస్తానని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం తనకు ఎంతో నచ్చుతుందని, ఆయన మాటలు వింటే తనకు తెలియకుండానే గూస్‌బంప్స్ వస్తాయని చెప్పుకొచ్చింది కావ్య. తన దృష్టిలో పవన్ క ళ్యాణ్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్న కావ్యశ్రీ.. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి



ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

‘‘హీరోయిన్‌గా నటించే అవకాశం రావాలనే  లేదు. ఆయనతో కలిసి సినిమాలో ఏదైనా చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా సంతోషంగా అంగీకరిస్తాను. ఆయనతో ఒకసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది’’ అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టిసింది. కావ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్‌పై ఆమె చూపించిన అభిమానాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *