అందం అభినయం ఉండి అదృష్టం లేని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ లు మాత్రం దక్కడం. దాంతో కొంతమంది సినిమాలు తగ్గించేస్తున్నారు. మరికొంతమంది ఇతరభాషలకు చెక్కేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయమైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్.. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న కూడా ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. స్టార్ డమ్ దూసుకుపోతుంది. ఇటీవలే రెండు పాన్ ఇండియా సినిమాలు చేసింది.. కానీ అవి కూడా ఈ అమ్మడికి సక్సెస్ తెచ్చిపెట్టలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన నెలవారీ ఖర్చుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
ఆమె ఎవరో కాదు.. తెలుగులో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న వయ్యారి భామ నిధి అగర్వాల్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. వరుస సినిమాలతోమెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది. తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. అలాగే గ్లామర్ పరంగా మెప్పించింది.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
టాలీవుడ్ లో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ చిన్నదాని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవలే నిధి రెండు పాన్ ఇండియా సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమాజ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో తన నెల ఖర్చుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నెలకు మీరు ఎంత ఖర్చు చేస్తారు అనే ప్రశ్నకు.. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని తెలిపింది. నా ట్రావెలింగ్, బస,డయిట్,జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్‌స్టైలింగ్, ఫోటోస్ లాంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.