Headlines

తొలి పరుగు కోసం 53 బంతులు.. టెస్టుల్లో ఊహించని రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్..!


Longest Dot Ball Streak: ప్రస్తుత రోజుల్లో భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), రిషభ్ పంత్ (Rishabh Pant), టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వంటి యువ ఆటగాళ్ల రాకతో గతంతో పోలిస్తే టెస్టుల్లోనూ రన్‌రేట్ గణనీయంగా పెరిగింది. అయితే పరిస్థితులు క్లిష్టంగా మారినప్పుడు బౌలర్ల దాడిని ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోవడం టెస్టు ఫార్మాట్‌లో అత్యంత ప్రధానమైన విద్య. చాలామంది అభిమానులు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ఆలోచిస్తుంటారు. ఆస్ట్రేలియాపై 18 పరుగుల వద్ద ఉన్న సమయంలో ద్రవిడ్ వరుసగా 40 డాట్ బాల్స్ ఆడారు. కానీ తన వ్యక్తిగత పరుగుల ఖాతా తెరవడానికి 50కి పైగా బంతులు ఆడిన ఘనత మాత్రం ద్రవిడ్ స్థానంలో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చేతేశ్వర్ పుజారా పేరిట నమోదైంది.

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

ఈ ఆసక్తికరమైన ఘట్టం 2018 నాటి దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనలో చోటుచేసుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం (Wanderers Stadium) లో జరిగిన మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉండటంతో ఇద్దరు ఓపెనర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. నాలుగో ఓవర్ సమయానికే క్రీజులోకి అడుగుపెట్టిన పుజారా, దక్షిణాఫ్రికా పేసర్ల భీకర బౌలింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నారు. మొదటి 53 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని ఆయన, చివరికి 54వ బంతికి తన మొదటి పరుగు సాధించి ఖాతా తెరిచారు.

ఇవి కూడా చదవండి



ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

కేవలం క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా, ఆ తర్వాత క్రమంగా స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. 176 బంతులు ఎదుర్కొన్న పుజారా 50 పరుగులతో అద్భుతమైన అర్ధశతకం సాధించారు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయనతో పాటు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli – 54 పరుగులు) మాత్రమే రాణించగా, మిగిలిన వారెవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. వీరిద్దరి పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసింది. బదులుగా దక్షిణాఫ్రికా 194 పరుగులు చేసి 7 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులు చేసి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ప్రత్యర్థిని 177 పరుగులకే కుప్పకూల్చి 63 పరుగుల తేడాతో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *