సోమవారం కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండలో బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఏపీలోని విజయవాడలో, తెలంగాణలోని వరంగల్‌లో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం 51 మండలాల్లో తీవ్రడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల విభాగం తెలిపింది. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 18 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు… కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం రోజున రాష్ట్రంలో అత్యధికంగా కడప జిల్లాలో పొట్టిపాడులో 43.8°C, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1°C, నంద్యాల జిల్లాలో 42.9°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :