తిరుమల నడకదారిలో నాగుపాము హల్‌చల్

తిరుమల నడకదారిలో నాగుపాము హల్‌చల్


పుణ్యక్షేత్రాలను పాములు, వన్యమృగాలు వదలట్లేదు. తాజాగా తిరుమల నడకమార్గంలో నాగుపాము ప్రత్యక్షమైంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఒక భారీ నాగుపాము భక్తులను బెంబేలెత్తించింది. అలిపిరి నడక మార్గంలోని మోకాళ్ళ మెట్ల వద్ద సుమారు ఆరు అడుగుల పొడవైన భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. దారికి అడ్డంగా వచ్చి పడగవిప్పి బుసలు కొడుతుండటంతో, కాలినడకన వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భక్తులు సమీపంలోని టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే టీటీడీ ఫారెస్ట్ విభాగంలోని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు కబురు పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన, ఎంతో అనుభవంతో ఆ ఆరడుగుల నాగుపామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆ పాముకు ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకుని తమ యాత్రను కొనసాగించారు. వేసవి కాలం దృష్ట్యా నడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘తనొక ఉడుత’ విజయ్‌కు వ్యతిరేకంగా నటి ప్రచారం

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి

బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..

జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *