టెక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఇక AI స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌! ప్రత్యేకత ఏంటంటే?

టెక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఇక AI స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌! ప్రత్యేకత ఏంటంటే?


స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో AI ప్రభావం రోజురోజుకీ పెరుగుతూ, వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటివరకు చాట్‌బాట్‌లు, కంప్యూటర్‌లకు మాత్రమే పరిమితమైన ఏఐ, ఇప్పుడు మొబైల్ ఫోన్‌లలో కీలక భాగంగా మారింది. ముఖ్యంగా ఇండియాలో వినియోగదారులు ఉపయోగకరమైన ఫీచర్లను ఎక్కువగా కోరుకునే నేపథ్యంలో ఈ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. మొదటగా కెమెరా రంగంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. శాంసంగ్‌, షావోమీ, వివో, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ ఫోన్‌లలో ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తున్నాయి. ఫోటో తీసేటప్పుడు అది సన్నివేశాన్ని గుర్తించి, ఆటోమేటిక్‌గా సెట్టింగ్‌లను మార్చడం వల్ల నైట్ ఫోటోలు, సెల్ఫీలు మరింత స్పష్టంగా వస్తున్నాయి.

బ్యాటరీ పనితీరు కూడా ఏఐ వల్ల మెరుగుపడుతోంది. ఫోన్ వినియోగదారుడి అలవాట్లను విశ్లేషించి, అవసరం లేని యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో నియంత్రించడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. దీంతో రోజంతా ఫోన్ సులభంగా ఉపయోగించుకోవచ్చు. కమ్యూనికేషన్‌లో కూడా ఏఐ కొత్త మార్పులు తీసుకొచ్చింది. కాల్‌లను లైవ్‌లో అనువదించడం, శబ్దాన్ని తొలగించడం, మాటలను టెక్స్ట్‌గా మార్చడం వంటి ఫీచర్లు బహుభాషా దేశమైన మన దేశంలో ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇది భాషా అడ్డంకులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

భద్రత విషయంలో కూడా ఏఐ ముందంజలో ఉంది. స్పామ్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లు వంటి మోసాలను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తుంది. అలాగే ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ వంటి భద్రతా వ్యవస్థలు మరింత వేగంగా, కచ్చితంగా పనిచేస్తున్నాయి. ఇక ఉత్పాదకత పరంగా చూస్తే, ఏఐ ఫీచర్లు రోజువారీ పనులను సులభతరం చేస్తున్నాయి. టెక్స్ట్ సారాంశాలు, రైటింగ్ అసిస్టెన్స్, స్మార్ట్ సెర్చ్, ఇమేజ్ ఎడిటింగ్ వంటి సౌకర్యాలు ఒకే ఫోన్‌లో లభిస్తున్నాయి. ఏఐ స్మార్ట్‌ఫోన్‌లు ఇక విలాసవంతమైనవి కాకుండా సాధారణ అవసరంగా మారుతున్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పాటు బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లలో కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి రావడంతో, భారతీయ వినియోగదారులకు సరికొత్త అనుభవం అందుతోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *