Headlines

జలపాతం వద్ద షాకింగ్ సీన్.. రాళ్లపై నుంచి ఒక్కసారిగా ఏదో జారిపడింది! ఏంటాని చూడగా.. వీడియో


ఓ జలపాతం వద్ద సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని షాకింగ్‌ అనుభవం ఎదురైంది. జలపాతం సమీపంలోని రాళ్లపై ఉన్న ఓ భారీ పాము ఒక్కసారిగా కిందకు జారి.. చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తి భుజాలపై పడింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది.

కుటుంబ సభ్యులు జలపాతం కింద ఉన్న రాళ్ల వద్ద కూర్చుని, నిలబడి సరదాగా గడుపుతున్నారు. ఇంతలో పైభాగంలోని రాళ్ల నుంచి ఓ పెద్ద పాము అకస్మాత్తుగా కిందకు దొర్లుకుంటూ వచ్చి.. ఓ వ్యక్తిపై పడింది. ఆ సమయంలో అతడి చేతుల్లో చిన్నారి కూడా ఉంది. పాము ఒక్కసారిగా మీద పడటంతో ఆ వ్యక్తి తీవ్రంగా భయపడ్డాడు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కొందరు రాళ్ల మధ్య, నీటి ప్రవాహం వద్ద కొందరు వ్యక్తులు భయంతో పరుగులు తీస్తూ కనిపించారు. అయితే జలపాతం పై నుంచి కింద పడిన పాము ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు ఓ వ్యక్తి రాళ్ల మధ్యకు వంగి చూడగం వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి



ఈ ఘటనను బాస్కర్ రెడ్డి అనే యూజర్‌ ఎక్స్ ఖాతాలో వీడియోగా షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘చాలా పెద్ద పాము.. అది నాగుపాము’ అని అరవడం వీడియోలో వినిపించింది. అయితే వీడియోను బట్టి అది నిజంగా నాగుపామేనా, లేక మరేదైనా పాము జాతికి చెందినదా అనేది ఇంకా నిర్ధారణకాలేదు. కాగా వర్షాకాలంలో మహారాష్ట్రలోని జలపాతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే జలపాతాల వద్ద రాళ్లు, పొదలు, నీటి ప్రవాహాల మధ్య పాములు, ఇతర వన్యప్రాణులు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో వాటికి దగ్గరగా వెళ్లకుండా తగినంత దూరం పాటించాలని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. ఈ ఘటనలో ముఖ్యంగా చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తిపై పాము పడటం మరింత ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరినీ పాము కాటు వేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *