Headlines

జలపాతం వద్ద షాకింగ్ సీన్..


జలపాతం వద్ద సరదాగా గడపడానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని భయానక అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ అంబోలి జలపాతం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు జలపాతం కింద రాళ్ల వద్ద ఆనందంగా గడుపుతుండగా, ఒక్కసారిగా పై నుంచి ఓ భారీ పాము కిందకు జారింది. సరిగ్గా అదే సమయంలో ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్న వ్యక్తి భుజాలపై ఆ పాము పడింది. ఊహించని ఈ పరిణామంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అక్కడే ఉన్న మిగతా జనం కూడా ప్రాణభయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. భాస్కర్‌ రెడ్డి అనే యూజర్‌ ఎక్స్‌ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో తీస్తున్న వారు అది నాగుపాము అని అరవడం వినిపించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆ పాము ఎవరినీ కాటు వేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో మహారాష్ట్రలోని జలపాతాలు పర్యాటకులతో కళకళలాడుతుంటాయి. అయితే రాళ్లు, పొదల మధ్య పాములు ఉండే ప్రమాదం ఉందని, పర్యాటకులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తిపై పాము పడిన ఈ ఘటన నెటిజన్లను సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడువు దాటితే.. లైసెన్స్‌ రద్దే!

ఒక్క కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే

కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక ముందడుగు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *