Headlines

చెవిలో ఉన్నట్లు కూడా తెలియనంత తేలికగా ఉండే ఇయర్ ఫోన్స్.. ధర ఎంతంటే?


చెవుల్లో ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ పెట్టుకునేవారికి తేలికైన డిజైన్‌తో వచ్చిన ఈ కొత్త మోడల్ ఆసక్తికరంగా ఉంది. 2,000కి పైగా హ్యూమన్ ఇయర్ మోడల్స్ ఆధారంగా ఎర్గోనామిక్ డిజైన్‌ను రూపొందించారు. Hi-Res ఆడియో, 10-బ్యాండ్ ఈక్వలైజర్, స్పేషియల్ ఆడియోతో పాటు AI అనువాదం, స్మార్ట్ బ్రాడ్‌కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు డివైస్‌లకు ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. IP55 రేటింగ్ కూడా ఉంది.

కేవలం 5.2 గ్రాములు..

ఈ ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ ఒక్కో యూనిట్ 5.2 గ్రాముల బరువుతో వస్తాయి. లెఫ్ట్, రైట్ అనే తేడా లేకుండా సింమెట్రికల్ డిజైన్ ఇచ్చారు. 2,000కి పైగా హ్యూమన్ ఇయర్ మోడల్స్ ఆధారంగా ఎర్గోనామిక్ ఆకృతిని రూపొందించారు. టైటానియం మెమరీ అల్లాయ్‌తో C-బ్రిడ్జ్‌ను తయారు చేశారు. పర్ల్ తరహా ఫినిష్‌తో పర్పుల్, వైట్ రంగుల్లో లభిస్తాయి.

ఆడియో కోసం 12mm డ్యూయల్-కాయిల్ డ్రైవర్ ఉంది. Hi-Res ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్‌తో పాటు మూడు ప్రత్యేక మోడ్‌లు ఉన్నాయి. బ్యాలన్సడ్ మోడ్ సౌండ్, పవర్ వినియోగం మధ్య సమతుల్యతను అందిస్తుంది. వోకల్ ఎన్హన్సమెంట్ మోడ్ వాయిస్ స్పష్టతపై దృష్టి పెడుతుంది. లీకేజీ ప్రూఫ్ మోడ్ బయటకు శబ్దం వెళ్లడాన్ని తగ్గిస్తుంది. 10-బ్యాండ్ ఈక్వలైజర్, స్పేషియల్ ఆడియో కూడా ఉన్నాయి.

AI కాల్ ఫీచర్లు..

కాల్‌ల కోసం డ్యూయల్ మైక్ సిస్టమ్, బీమ్‌ఫార్మింగ్, AI నాయిస్ రిడక్షన్ ఉన్నాయి. VPU బోన్ కండెక్షన్ మైక్ బోన్ వైబ్రేషన్ ద్వారా వాయిస్‌ను గుర్తిస్తుంది. ట్రాఫిక్, కీబోర్డ్, హార్న్ వంటి శబ్దాలను తగ్గించే టెక్నాలజీ కూడా ఉంది. ఒకేసారి మూడు డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు.

మొత్తం 42 గంటల ప్లేబ్యాక్, ఒక్కసారి ఛార్జ్‌తో 10 గంటల వరకు వినియోగం లభిస్తుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. Qi వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. IP55 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. AI స్మార్ట్ ట్రాన్స్‌లేషన్, AI స్మార్ట్ బ్రాడ్‌కాస్ట్, Blue OS ఇంటిగ్రేషన్, రిమోట్ ఫోటో కంట్రోల్, ఫైండ్ ఇయర్‌ఫోన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టాండర్డ్ వర్షన్ ధర 699 యువాన్‌ (సుమారు రూ.10,000), వైర్‌లెస్ ఛార్జింగ్ వర్షన్ 799 యువాన్‌ (సుమారు రూ.11,435).



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *