Headlines

చివరకు ఆయన్ను కూడా వదట్లేదుగా.. రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!


కాలంతో పాటు పండగు చేసే కల్చర్‌ కూడా మారుతూ వస్తోంది.. ఈ మధ్య కాలంలో చాలా మంది వినాయక మండపాల్లోని గణనాథుడికి నోట్ల కట్టలతో చేసిన దండలను అలంకరిస్తున్నారు. కానీ దొంగలు వాటిని కూడా వదలట్లేదు.. తాజాగా చెన్నైలోని ఓ వినాయక మండపంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గణనాథుడి మెడలో ఉన్న రూ.10వేల విలువైన నోట్ల దండను ఎత్తుకెళ్లారు కొందరు దుండగులు. ఇక నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.

గణేషుడి మెడలో అలంకరించిన రూ.10వేల విలువైన నోట్ల దండనే ఎత్తుకెళ్లిన ఘటన చెన్నైలోని వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తండయార్‌పేట్, నేతాజీ నగర్ 3వ వీధికి చెందిన విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి కూడా ఆయన తన ఇంటి ఆవరణలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం రూ. 100 నోట్లతో తయారు చేసిన రూ. 10,000 విలువైన దండను వినాయకుడికి అలంకరించారు. ఇక రాత్రి వరకు గణేషుడి దగ్గరే ఉన్న విఘ్నేశ్వరన్ ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

అయితే తర్వాతి రోజు ఉదయం వచ్చి చూడగా విగ్రహం మెడలో ఉన్న రూ. 10,000 నోట్ల దండ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన విఘ్నేశ్వరన్ వెంటనే ఆర్కే నగర్ పోలీసులుకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. అర్థరాత్రి కొందరు యువకులు మండపంలోకి దూరి నోట్ల దండను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.

దీంతో చోరీకి పాల్పడినట్లు గుర్తించిన 20, 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు చోరీలో భాగమైన 16, 17 ఏళ్ల వయసున్న నలుగురు మైనర్లను కూడా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన మొత్తంలో మిగిలిన రూ. 5,100 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *