‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా పట్టాలెక్కిన ‘మెరుపు’ చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా..? భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎంతో అత్యుత్సాహంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ కేవలం 15 రోజుల చిత్రీకరణ తర్వాతే అటకెక్కింది. అయితే దీని వెనుక రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది సినిమా బడ్జెట్. ఈ సినిమాకు ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్ హద్దులు మీరడం అనేది అప్పట్లో సమస్యగా మారింది. ఇక రెండోది, అప్పటివరకు తీసిన అవుట్ పుట్ మెగాస్టార్ చిరంజీవిని ఏమాత్రం మెప్పించలేకపోవడం. ఈ రెండు కారణాల వల్లే ఎన్నో అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయి. కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ధరణి తెరకెక్కించాల్సిన ఈ స్పోర్ట్స్ డ్రామా 2010 ఏప్రిల్ 30వ తేదీన ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అప్పట్లో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ కూడా బాగానే జరిగింది. రామ్ చరణ్‌కు జోడీగా మగధీర బ్యూటీ కాజల్‌నే తీసుకున్నారు. పైగా ధరణికి అప్పటికే తమిళంలో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి.. మరోవైపు తెలుగులో ఆయన చేసిన బంగారం కూడా పర్లేదు అనిపించింది. మెరుపు సినిమాను ఆర్.బి. చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందించాల్సి ఉంది. ఈ సినిమా తొలి షాట్ కు చిరంజీవినే స్వయంగా క్లాప్ ఇచ్చారు. గతంలో చిరు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘విజేత’ తరహాలో ఈ స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీ తన కెరీర్ లో కూడా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ బలంగా నమ్మాడు. అందుకే ఓపెనింగ్ రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ స్థాయిలోనే హైప్ క్రియేట్ అయింది. ముందుగా ఈ సినిమాను 35 కోట్ల రూపాయలతో తీయాలని ప్లాన్ చేస్తే, దర్శకుడు దాన్ని కాస్తా అదనంగా మరో 10 కోట్లు పెంచేశాడు. ఆ సమయంలోనే ఆరెంజ్ సినిమా విడుదలై డిజాస్టర్ కావడంతో.. నిర్మాత రిస్క్ తీసుకోలేకపోయాడు. బడ్జెట్ చూసిన నిర్మాత ఆర్.బి. చౌదరి తనవల్ల కాదంటూ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారు. చివరకు చిరంజీవి చొరవ తీసుకుని నచ్చజెప్పడంతో చెన్నైలో 15 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ చేశారు. ఈ చిన్న షెడ్యూల్‌కే ఏకంగా 8 కోట్లు ఖర్చు కావడం, తీసిన సీన్స్ చూశాక చిరంజీవికి ఏమాత్రం సంతృప్తినివ్వకపోవడంతో పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dacoit OTT: అప్పుడే OTTలోకి ‘డెకాయిట్’.. ఎప్పుడంటే
Michael: మైఖేల్ దెబ్బకు.. బద్దలైన ధురంధర్ 2 రికార్డ్
ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. అసలు విషయం చెప్పిన కార్తీక దీపం సుమిత్ర