గంగమ్మ తల్లి చెంత ప్రధాని.. హుగ్లీ అలలపై మోదీ పయనానికి ఫిదా అయిన కోల్‌కతా!

గంగమ్మ తల్లి చెంత ప్రధాని.. హుగ్లీ అలలపై మోదీ పయనానికి ఫిదా అయిన కోల్‌కతా!


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతా పర్యటనలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 24) ఉదయం హుగ్లీ నది తీరాన ఆహ్లాదకరంగా గడిపారు. బోటులో విహరిస్తూ నదీతీర ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆయన, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ మరియు విద్యాసాగర్ సేతు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులతో, మార్నింగ్ వాకర్స్‌తో మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రధానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. “ప్రతి బెంగాలీ మనసులో గంగానదికి ప్రత్యేక స్థానముంది. బెంగాల్ ఆత్మ గుండా ప్రవహించే గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావడం నా అదృష్టం” అని మోదీ పేర్కొన్నారు. గురువారం రోడ్‌షోలో హౌరా బ్రిడ్జ్‌పై వెళ్లిన ప్రధాని మోదీ, నేడు నదిపై నుంచి ఆ వంతెన అపురూప దృశ్యాన్ని వీక్షించడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *