Headlines

కొత్త లుక్‌తో పిచ్చెక్కించేస్తున్న యాపిల్​.. ఐఫోన్​ లవర్స్​ మాత్రం కొనకుండా కంట్రోల్ చేసుకోలేరు


2017లో iPhone Xను పరిచయం చేసిన సమయంలో Apple నాచ్ డిస్‌ప్లేను తీసుకొచ్చి స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కీలక మార్పు చేసింది. ఇప్పుడు 20వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి అలాంటి కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన వివరాలన్నీ లీకులు, నివేదికల ఆధారంగానే ఉన్నాయి. ఫోన్ డిజైన్‌, ఫీచర్లు, పేరుపై Apple నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నాలుగు వైపులా కర్వ్డ్ గ్లాస్..

టిప్‌స్టర్ Ice Universe ఎక్స్‌ (X)లో షేర్ చేసిన వీడియోలో iPhone 20 Proకు చెందినదిగా చెబుతున్న 3D క్వాడ్ కర్వ్డ్ గ్లాస్ కనిపించింది. ఈ గ్లాస్ నాలుగు వైపులా వంపుతో ఉండటంతో పాటు ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ వరకు కలిసిపోయేలా కనిపిస్తోంది. దీంతో స్క్రీన్ అంచులు, ఫోన్ బాడీ మధ్య స్పష్టమైన విభజన తక్కువగా ఉండే అవకాశం ఉంది. వీడియోలో ముందు భాగంలో రెండు నల్లటి గుర్తులు కూడా కనిపించాయి. అవి సెల్ఫీ కెమెరా లేదా ఇతర సెన్సర్లకు సంబంధించినవా అనేది ఇంకా తెలియలేదు.

కొత్త ఐఫోన్‌లో నాలుగు మూలల గుండ్రని డిస్‌ప్లే డిజైన్‌ కొనసాగవచ్చని అంచనా. Dynamic Island పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Face ID కోసం అవసరమైన కొన్ని సెన్సర్లను డిస్‌ప్లే కింద అమర్చేందుకు Apple ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లీకైన గ్లాస్ ఆధారంగా ఫోన్ తుది డిజైన్‌ను నిర్ధారించలేం.

A-Series చిప్‌!

2027లో రానున్న వార్షికోత్సవ ఐఫోన్‌లో ప్రత్యేక Action Button ఉండకపోవచ్చని మరో నివేదిక వెల్లడించింది. దాని పనులను Camera Control Buttonతో కలపాలని Apple భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి నొక్కితే కెమెరా ఓపెన్ అవ్వడం, ఎక్కువసేపు నొక్కితే యూజర్ ఎంచుకున్న యాక్షన్ పనిచేయడం వంటి విధానం ఉండొచ్చని తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ పక్క అంచులపై బటన్ల అమరికలోనూ మార్పులు రావచ్చు.

ఇక iPhone 20 Proలో కొత్త A-Series చిప్‌, వెనుకవైపు మూడు కెమెరాలు ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. 2017లో iPhone Xతో డిజైన్‌లో పెద్ద మార్పు తీసుకొచ్చిన Apple, 2027లోనూ తన 20వ వార్షికోత్సవ మోడల్‌తో ప్రత్యేకత చాటుకోవాలని భావిస్తున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ధర, కెమెరా వివరాలు, బ్యాటరీ సామర్థ్యం, ఇతర ఫీచర్లపై ఇంకా స్పష్టత లేదు. Apple అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వివరాలను లీకులుగానే పరిగణించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *